రైతు రథం పథకం ద్వారా.! సబ్సిడీపై ట్రాక్టర్లు.. ఇలా అప్లై చేసుకోండి

ఏపీలో రైతులకు తీపి కబ్బురు.రైతుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రైతు భరోసా (Rythu Bharosa), పంట నష్టం రైతన్నలకు కోట్ల రుణాలు అందిస్తున్న ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీ పై అందజేస్తుంది.

రైతు రథం

సంక్షేమమే ధ్యేయంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈసారి వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇవ్వబోతోంది. ఇక వైయస్సార్ రైతు రథం పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీ ద్వారా అందజేస్తుంది రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పరికరాలు రౌండ్లు ట్రాక్టర్లు ఇస్తామని గతంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు తెలిపారు అందుకు తగినట్లుగానే రైతు రథం స్కీమ్ ద్వారా అన్నదాతలకు ట్రాక్టర్ల పంపిణీ చేయనున్నారు.

ఇక జూన్ 7వ తేదీన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ యంత్రసేవ వైఎస్సార్ రైతు రథం పథకాన్ని ప్రారంభిస్తుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల రైతులకు 3,800 ట్రాక్టర్లు 390 హార్వెస్టర్ అందిస్తారు ఇక గుంటూరు జిల్లా కేంద్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల వ్యాప్తంగా ఆయా జిల్లాలకు చెందిన రైతులకు 1215 ట్రాక్టర్లు 77 కంబైన్డ్ హార్వెస్టర్ పంపిణీ చేస్తారు.

ఈ పథకం ద్వారా వ్యవసాయ సబ్సిడీ ట్రాక్టర్ పొందాలనుకునే రైతులు ముందుగా చిన్న సన్నకారు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడాలని ఉంటుంది కనీసం మూడు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడాలని దానికి డ్వాక్రా గ్రూపుల తరహాలో ఏదైనా ఒక పేరును పెట్టుకోవాలి రైతులు ప్రతి ఒక్కరూ తమ పట్టాదార్ పాస్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు బ్యాంకు నుంచి రుణాలు ఏవీ లేవని no due సర్టిఫికెట్ను జతచేయాలి ఈ డాక్యుమెంట్ సంగతిని రైతు భరోసా కేంద్రాల్లో సమర్పించాలి.

Leave a Comment