Rythu Bandhu – రైతన్నలకు కేసీఆర్ తీపికబ్బురు ఖాతాల్లో రైతుబంధు

యాసంగి సీజన్‌ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుబంధు నిధులు త్వరలో పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

రైతుబంధు

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశంలో మిగతా రాష్ట్రాలకు ఎంతో ఆదర్శం రైతు బంధు పథకం రైతులకు ఆర్ధిక తోడ్పాటు తో పాటు భరోసాను కలిగిస్తుంది.

రైతుబంధు

రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు అమలు అయ్యలా చూడాలని అధికారులని ఆదేశించారు.ఇప్పటికే
నిధుల పంపిణి ఆలస్యం అయింది దింతో రైతులు రైతుబంధు నగదు కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సందర్భంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు.

రైతు బంధు పథకం

రైతు బంధు నిధుల సర్దుబాటు చేసుకొని డిసెంబర్ 15 తేదీ లోపు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ గారు సూచించారు. ప్రతి ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం కేసీఆర్.

అయితే ఈ యాసంగి సీజన్లో ఈ పథకం అందుకునే రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతుల సంఖ్య అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇక కొత్తగా ఎవరైనా పాస్ పుస్తకాలు జారీ అయితే ఏఈఓలకు వాటి వివరాలను పూర్తిగా సమర్పించాల్సి ఉంటుంది ఇక గతంలో రైతు బంధు పథకం తీసుకున్న రైతులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

నగదు అందుకోబోతున్న రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు.

Leave a Comment