అన్నదాతలు శ్రేయస్సు వారు ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచడానికి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ తాజాగా రైతు బంధు పథకం ఫై కీలక నిర్ణయం తీసుకుంది.రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు బంధు డబ్బులు ఫై తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైతు బంధు
వచ్చే నెల జూన్ 24 తేదీ నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి వానాకాలం రైతుబంధు అమలు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.
తెలంగాణ సాధారణ రైతులు ఏవిధంగానైతే రైతుబందు తీసుకుంటున్నారో అదే విధంగాపోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన పుత్రులు సైతం రైతుబందు స్కీం వర్తింప చేసేలాచర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.దేనికి సంబందించి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి నేరుగా ఖాతాలో జమ చేస్తారు.రైతుల బ్యాంకు ఖాతాల పూర్తి సమాచారం ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ను సిఎం కేసిఆర్ ఆదేశించారు