ఏపీ సంక్షేమ పథకాల షెడ్యూల్ క్యాలెండర్ ఇదే – AP Welfare Schemes Calendar

ఏపీ సంక్షేమ పథకాల షెడ్యూల్ | సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నభూతోనభవిష్యతి వ్యవహరిస్తుంది నవరత్నాలు తో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలు న్యాయం చేకూరుస్తున్నారు.

ఏపీ సంక్షేమ పథకాల షెడ్యూల్

దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయి.కులం మతం ప్రాంతం బేధాలు లేకుండా అర్హత ప్రామాణికంగా పారదర్శకంగా జగన్ సర్కార్ పాలనా సాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేసింది 23 పథకాలకు సంబంధించిన షెడ్యూల్ను ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని గారు విడుదల చేశారు.

ఇక ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 అమలు పరిచే పథకాల లిస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల షెడ్యూల్ వివరాలు చుడండి:

ఏప్రిల్‌ 2021

  • జగనన్న వసతి దీవెన 1వ విడత 5లక్షల మందికి పైగా విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల చెల్లింపు
  • జగనన్న విద్యా దీవెన 1వ విడత 18లక్షల 80వేల మందికి లబ్ధి.
  • పొదుపు సంఘాల మహిళలకు
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు
  • రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ(2019 రబీ)

మే 2021

  • మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ)
  • మత్స్యకార భరోసా (డీజిల్‌ సబ్సిడీ)
  • రైతులకు వైఎస్సార్‌
  • ఉచిత పంటల బీమా(2020 ఖరీఫ్‌ )
  • వైఎస్సార్‌ రైతు భరోసా 1వ విడత

జూన్‌ 2021

  • వైఎస్సార్‌ చేయూత
  • జగనన్న విద్యా కానుక

జూలై 2021

  • జగనన్న విద్యా దీవెన 2వ విడత
  • వైఎస్సార్‌ కాపు నేస్తం
  • వైఎస్సార్‌ వాహన మిత్ర

ఆగస్టు 2021

  • రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు(2020 ఖరీఫ్‌)
  • ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు
  • ఆగస్టు 08 తేదీ వైఎస్సార్‌ నేతన్న నేస్తం

సెప్టెంబర్‌ 2021

  • వైఎస్సార్‌ ఆసరా పథకం- డ్వాక్రా మహిళలకు

అక్టోబర్‌ 2021

  • వైఎస్సార్‌ రైతు భరోసా పథకం 2వ విడత
  • జగనన్న చేదోడు
  • జగనన్న తోడు

నవంబర్‌ 2021

  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

డిసెంబర్‌ 2021

  • జగనన్న వసతి దీవెన పథకం 2వ విడత – విద్యార్థులకు
  • జగనన్న విద్యా దీవెన పథకం 3వ విడత – విద్యార్థులకు
  • వైఎస్‌ఆర్‌ లా నేస్తం

జనవరి 2022

  • వైఎస్సార్‌ రైతు భరోసా 3వ విడత
  • జగనన్న అమ్మ ఒడి పథకం
  • పెన్షన్‌ పెంపు నెలకు రూ.2500

ఫిబ్రవరి 2022

  • జగనన్న విద్యా దీవెన పథకం 4వ విడత

ఇక జగనన్న గోరు ముద్ద,వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,వైస్సార్ జలకల, ఉచిత విద్యుత్, , ఆరోగ్య ఆసరా,వైఎస్సార్‌ బీమా,వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, పెన్షన్‌ కానుకలు కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు అవుతున్నాయి.

Leave a Comment