ఏపీ పాఠశాలలు వేసవి సెలవులు ఎప్పటివరకు..! పునఃప్రారంభం తేదీలు ఇవే

ఏపీ పాఠశాలలు | ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యార్థులకు శుభవార్త. ఏపీలో ఎండలు రోజు రోజుకు విపరీతంగా మండిపోతున్నాయి. ఈ తరుణంలో స్కూల్కి వెళ్లే విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లో జాబితాను సెలవుల ప్రకటించింది.

ఏపీ పాఠశాలలు వేసవి సెలవులు

ఏపీ పాఠశాలలు వేసవి సెలవులు ఈ విద్యా సంవత్సరంలో మే 6 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ తాజాగా ఏపీ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఏప్రిల్ 23వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

గత రెండేళ్లుగా ఏపీ రాష్ట్రంలో కరోనా కారణంగా విద్యా సంవత్సరం లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి సిలబస్ తగ్గింపు సెలవులు గుర్తింపుతో పాటు విద్యా సంవత్సరానికి సైతం భారీగా కోత పడుతుంది. అయితే తాజాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను యధావిధిగా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇక ఏపీలో ఏప్రిల్ 27 నుంచి మే తొమ్మిదో తేదీ వరకు (SSC) ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. మే 4వ తేదీ లోగా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అన్ని పరీక్షలు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది ఇక మొత్తంగా దాదాపు 50 రోజులకు పైగా వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మే 9 న పాఠశాలలకు సెలవులు ప్రారంభం జూలై 4న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

Leave a Comment