రుణమాఫీ దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పాదంలో దూసుకుపోతుంది. రైతు బందు రైతు బీమా పథకాలు రైతులకు ఆర్ధిక తోడ్పాటు భరోసా ఏంతో మేలు చేసాయి.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్
రుణమాఫీ
రైతు రుణమాఫీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రుణమాఫీ నగదు మొత్తాన్ని బ్యాంకర్లు ఇతర ఖాతా అప్పు కింద జమ చేయవద్దని, పూర్తిగా రుణమాఫీ ఖాతాలోనే (Loan accounts) జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రులు బ్యాంకర్లకు సూచించారు.రైతుబంధు తరహాలోనే రుణమాఫీ 100% విజయవంతంగా పంట రుణాలు మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇప్పటికే 25,000 వేలు, 50,000 వేలు ఉన్న రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం త్వరలోనే లక్ష రూపాయలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది.
రైతులు యాసంగి లో రైతులు వరి పంట బదులు మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని కేసీఆర్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గారు సూచనలు చేశారు.
రుణమాఫీపై తెలంగాణ రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అనుకున్న సమయానికే రుణమాఫీ అమలు చేస్తామని భరోసా కల్పించారు సీఎం కేసీఆర్.