రైతుబీమా పథకం | దేశానికి రైతు వెన్నుముక ఇక దేశంలో రైతుల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి ఇక ముఖ్యంగా తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం డిసెంబర్ 28వ తేదీ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో పాటు రైతులకు ఆర్థిక చేయూతతో పాటు భరోసా కల్పించే రైతుభీమా పథకం సైతం అమలు చేస్తున్నారు.
రైతు బీమా
ఇక రైతు బంధు కు అర్హులుగా ఉండే రైతులు రైతు బీమా పథకానికి సైతం అర్హులుగా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడం కోసం రైతుబీమా స్కీమ్ ను తీసుకొచ్చింది. అనుకోని కారణాల వల్ల రైతులు ఎవరైనా మరణిస్తే నామినీకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు.
రైతుబీమా పథకానికి దరఖాస్తు చేయాలంటే ఆ రైతు వయసు 18 నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉండాలని నియమం.రైతు బీమా పథకం రైతులకు ఎంతో ధీమా రైతు బీమా పథకాన్ని కి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు డెత్ సర్టిఫికెట్ ఓటర్ ఐడీ కార్డు బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ నామిని ఆధార్ కార్డు ఇవన్నీ జత చేసి వాటిని మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారులు లేదా రైతు వేదికకు సమర్పించాలి.అనంతరం క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు విచారణ జరిపి ఆమోదిస్తారు ఇది రైతు వేదిక ద్వారా ఆన్లైన్లో ప్రాసెస్ చేయబడుతుంది ఇక 30 రోజుల్లో ఎవరైతే మరణించిన నామిని ఖాతాలో 5,00,000 లక్షలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేయబడుతాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు మరియు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కోరారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుభీమా పథకం తో ఎంతో మంది లబ్ధి పొందారు అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ సర్కార్ రైతు భీమా పథకం తో మరోసారి దేశ ప్రజలను ఆకర్షించింది.