దేశంలో బాంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.గత రోజులు పెరిగిన గోల్డ్ ఈ రోజు మాత్రం తగ్గింది.బుధవారం (10/3/2021) దేశీయంగా బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
పసిడి ధర (Today Gold Price)
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి రేట్ ఈ రోజు అతి స్వల్పంగా పడింది.
ఇందుకు ప్రధాన కారణం బంగారం ఫై పెట్టుబడులు ఉపసంహరించుకొని డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.అందుకే పసిడి ధర పడింది.మరోవైపు ఆల్టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ బుల్లిన్ మార్కెట్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల రూ.380 తగ్గి బంగారం ధర రూ.45,440 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర 350 దిగిరావడంతో .41,650 అయింది.
అయితే బంగారం పడితే వెండి ధర స్వల్పంగా పెరిగింది వెండి ధర కేజీకి రూ.100 పెరిగింది. దీంతో రేటు రూ.71,100కు చేరింది.